Supreme Court: ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్.. కేఏ పాల్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం
Supreme Court: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Supreme Court: ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్.. కేఏ పాల్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం
Supreme Court: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ (PPP - Public-Private Partnership) విధానంలో నిర్వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేఏ పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఘాటుగా స్పందించింది.
"మీడియాలో ప్రచారం కోసం ఇలాంటి పిటిషన్లు దాఖలు చేస్తున్నారని" ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ముందుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాలని కేఏ పాల్‌కు సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ, పిటిషన్‌పై విచారణకు నిరాకరించింది.