Nimmagadda case updates: నిమ్మగడ్డ కేసులో జగన్ సర్కార్‌కు చుక్కెదురు

Nimmagadda case updates: ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ విష‌యంలో జ‌‌గ‌న్ స‌ర్కార్‌కు చుక్కెదురైంది. ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ కుమారే కొనసాగాలంటూ న్యాయస్థానాలు, గవర్నర్ చెప్పినా.. ఆమేరకు ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలకు తీసుకోలేదు

Update: 2020-07-24 13:06 GMT
Nimmagadda case updates

Nimmagadda case updates: ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ విష‌యంలో జ‌‌గ‌న్ స‌ర్కార్‌కు చుక్కెదురైంది. ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ కుమారే కొనసాగాలంటూ న్యాయస్థానాలు, గవర్నర్ చెప్పినా.. ఆమేరకు ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలకు తీసుకోలేదు. ఈ విషయంలో జగన్ సర్కారుపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణపై స్టే ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా జగన్ సర్కారుపై ధర్మాసం తీవ్ర స్థాయిలో స్పందించింది. ఇప్పటికే రాజకీయంగానూ తీవ్ర విమర్శలకు ఎదుర్కొంటున్న జగన్ సర్కారుకు దీంతో మ‌రో సారి కోర్టుల్లో చుక్కెదురైన‌ట్టు అయ్యింది.

నిమ్మగడ్డ అంశంలో కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్‌పై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. శుక్రవారం విచారణ జరిగింది. ఈ కేసు విషయంలో ప్రతి విషయం తమకు తెలుసని.. కావాలనే ఈ కేసులో స్టే ఇవ్వట్లేదని.. గవర్నర్‌ లేఖ పంపినా రమేష్‌ కుమార్‌కు పోస్టింగ్‌ ఇవ్వకపోవడం అత్యంత దారుణమని సీజేఐ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఈ వివాదంపై హైకోర్టు తీర్పును త‌ప్పుబ‌ట్ట‌డం, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయ‌డం వంటి అంశాల‌ను నిమ్మగడ్డ తరపు లాయర్ హరీష్ సాల్వే కోర్టుకు వివరించారు. కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా మాట్లాడినవాళ్ల ఆడియో, వీడియో క్లిప్పింగ్స్ తనకు అందజేయాలనిసుప్రీంకోర్టు  కోరింది. చివరికిగా, ఏపీ హైకోర్టులో జరగబోయే పరిణామాలపై తదుపరి అఫిడవిట్ దాఖలు చేస్తామని నిమ్మగడ్డ తరఫు లాయర్ కోరగా, అందుకు సుప్రీంకోర్టు వారం రోజులు గడువిచ్చింది.

ఏపీ ప్ర‌భుత్వం నిమ్మగడ్డరమేష్‌ కుమార్ పదవీ కాలం కుదింపు, కొత్త కమిషనర్‌గా జస్టిస్ కనగరాజును నియమిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే  రమేష్ కుమార్ తిరిగి ఎస్‌ఈసీగా నియ‌మించాల‌ని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కే ప్రకారం రాష్ట్ర ఎన్నికల అధికారిని నియమించే అధికారం గవర్నర్‌కు ఉందని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. .

ఆ తర్వాత ఏపీ సర్కార్ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరినా.. సుప్రీం కోర్టు తిరస్కరించింది. హైకోర్టు తీర్పును అమలు చేయకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ నిమ్మగడ్డ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైనా కోర్టు విచారణ జరిపింది.. గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వాలని హైకోర్టు సూచించింది. దీంతో నిమ్మగడ్డ గవర్నర్‌ను కలిసి తనను తిరిగి పదవిలో నియమించాలని కోరారు. ఇటు ప్రభుత్వం కూడా కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

Tags:    

Similar News