Raghu Rama Raju: కాసేపట్లో రఘురామ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ
Raghu Rama Raju: రఘురామ హెల్త్ రిపోర్టులను కోర్టుకు అందజేయనున్న అధికారులు
రఘు రామ రాజు (ఫైల్ ఇమేజ్)
Raghu Rama Raju: కాసేపట్లో ఎంపీ రఘురామకృష్ణ రాజు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారించనుంది. అటు ఎంపీ హెల్త్ రిపోర్ట్స్‌ను కోర్టుకు అందజేయనున్నారు అధికారులు. ఇదిలా ఉండగా.. ఎంపీ రఘురామకృష్ణ రాజుకు బెయిల్ ఇవ్వొద్దని ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు ఎంపీ కుట్రలు పన్నుతున్నారని పేర్కొంది. ఇలాంటి సమయంలో ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇవ్వనుందోనని ఉత్కంఠ నెలకొంది.