Madanapalle: 71వ ఘనతంత్ర దినోత్సవ ఏర్పాట్ల పరిశీలించిన సబ్ కలెక్టర్

71వ ఘనతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహిద్దామని సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి.

Update: 2020-01-25 12:16 GMT

మదనపల్లి: 71వ ఘనతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహిద్దామని సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి. శనివారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాటశాల ఆవరణంలో ఆదివారం ఉదయం నిర్వహించే ఘనతంత్ర వేడుకలకు జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఘనతంత్రదినోత్సవ వేడుకలలో పోలీసుల కవాతును సబ్ కలెక్టర్ పరిశీలించి, ఏర్పాట్లను పకడ్భందీగా నిర్వహించాలని అతిధులకు సీటింగ్ అరేంజ్మెంట్, త్రాగు నీరు ఏర్పాటు చేయాలని సంబందిత అధికారులకు తెలిపారు. సాయంత్రం లోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముందస్తుగా పోలీసు కవాతు, వివిధ పాటశాలల పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమాలు రిహార్సల్స్ ను పూర్తి చేసుకోవాలని తెలిపారు.

ఎవరికీ కేటాయించిన సీట్లలో ఆదివారం ఉదయం 7.30 కి అంతా ఆశీనులు కావాలని తెలిపారు. స్టాల్స్ కేటాయించిన శాఖలు ఉదయం 6గంటలకి అంతా సిద్దం చేసుకోవాలని సంబందిత శాఖలను ఆదేశించారు. ఈ రోజు సాయంత్రానికి అంతా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుందని తహసీల్దార్ సురేష్ బాబు సబ్ కలెక్టర్ గారికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లీలా మాధవి, ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు రెడ్డన్న శెట్టి, ఎన్.సి.సి. ఆఫీసర్ గిరిధర్, స్కౌట్ ఆఫీసర్ శకుంతల, తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News