Srisailam: శ్రీశైలం నిత్యాన్నదాన భవనంలో పేలిన స్ట్రీమింగ్ బాయిలర్
Srisailam: పేలుడు ధాటికి ఉలిక్కి పడ్డ భక్తులు
Srisailam: శ్రీశైలం నిత్యాన్నదాన భవనంలో పేలిన స్ట్రీమింగ్ బాయిలర్
Srisailam: శ్రీశైలంలోని నిత్యాన్నదానం భవనంలో అన్నం వండే స్ట్రీమింగ్ బాయిలర్ పేలింది. పేలుడు ధాటికి భవనంలో ఉన్న భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయాలపాలైన వర్కర్లను దేవస్థానం వైద్యశాలకు తరలించారు. నిత్యాన్నదానం మందిరంలో భక్తుల కోసం అన్నం రెడీ చేసే సమయంలో బాయిలర్ హీట్ అయి ప్రమాదవశాత్తు పేలినట్లు అధికారులు భావిస్తున్నారు.