శ్రీకాకుళం జిల్లాలో పెరుగుతున్న వీధి కుక్కలు.. పిల్లలపైనే ఎక్కువగా దాడులు

Srikakulam: దాడులకు దిగుతున్న వీధికుక్కలు

Update: 2023-03-10 04:29 GMT

శ్రీకాకుళం జిల్లాలో పెరుగుతున్న వీధి కుక్కలు.. పిల్లలపైనే ఎక్కువగా దాడులు

Srikakulam: రాత్రీ, పగలు తేడా లేకుండాకుక్కలు వీధుల్లో గుంపులు..గుంపులుగా స్వైరవిహారం చేస్తుండటంతో సి క్కోలు జిల్లావాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. శునకాలు ఇష్టానుసారం దాడులు చేసి గాయపరుస్తున్నాయి. వీటి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్నాకట్టడికి మాత్రం చర్యలు శూన్యం అంటూ జిల్లావాసులు మండిపడుతున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో వీధికుక్కల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. గత ఏడాది 42 వేల 336 మంది, ఈ ఏడాది జనవరిలో 4 వేల 232, ఫిబ్రవరిలో 3వేల 206 మంది కుక్కకాట్లతో ఆసుపత్రుల పాలయ్యారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ కుక్కలు 15 సంవత్సరాల లోపువారిపైనే ఎక్కువగా దాడి చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆగడాలు ఆగడంలేదు. వీటి సంఖ్య గణనీయంగా పెరగడం, ఆహారకొరత పెరడం, మురికి నీరు తాగడం వల్ల పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తున్నాయని తెలుస్తోంది. శ్రీకాకుళం నగరంలోని రాత్రి 10 గంటల తరువాత ఆర్టీసీ బస్సాండ్, అంబేదర్క్ జంక్షన్, డే అండ్ నైట్ జంక్షన్, మాదవ మోటార్స్, ఉమన్స్ కాలేజీ రోడ్లలో బైక్స్ పై వెళుతున్నవారిపై కుక్కలు దాడులకు దిగుతున్నాయి.

బూర్జ మండలం లాభాంలోని ఓ కుక్క అయిదేళ్ల నుంచి సంచరిస్తూ దాడులు చేస్తోంది. 20 రోజుల కిందట గ్రామంలోని ఓ వృద్ధురాలిని కరిచి ఇలా గాయపరిచింది. కుటుంబసభ్యులు వెంటనే శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.

ఇక శ్రీకాకుళం నగరంలో కుక్కల సంతతి నివారణ చర్యలను గాలికొదిలేశారు. అయిదేళ్ల కిందట ఎనిమిది లక్షలు వెచ్చించి పశుసంవర్థకశాఖ కార్యాలయం ఆవరణలో కుక్కలకు శస్త్రచిక్సితలు చేసేందుకు ఆపరేషన్‌ థియేటర్‌ నిర్మించారు. కొంతకాలం మొక్కుబడిగా సంతాన నియంత్రణ శస్త్ర చికిత్సలు చేసి.. తరువాత విస్మరించారు. 

Tags:    

Similar News