శ్రీ విష్ణు గ్రూప్‌తో ఎస్ఆర్ఎం వర్సిటీ ఎంవోయూ

Update: 2025-12-11 05:46 GMT

అమరావతి: అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో ముందుకు సాగుతున్న ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పరిశోధనల విస్తృతి దిశగా ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో పేరున్న విద్యా సంస్థగా గుర్తింపు కలిగిన శ్రీవిష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీతో బంధాన్ని ఏర్పరచుకుని పరస్పర సహకారంతో వివిధ రంగాల్లో పరిశోధనలు జరిపేందుకు సమాయత్తమైంది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ చైర్మన్ డాక్టర్ రవిచంద్ర రాజగోపాల్ తో బుధవారం సమావేశమైన ఎస్ఆర్ఎం వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య సతీష్ కుమార్, రిజిస్ట్రార్ ప్రేమ్ కుమార్లు పరస్పర సహకారంతో కూడిన పరిశోధనలే లక్ష్యంగా ఎంవోయూ పత్రాలపై సంతకాలు చేశారు. ఎస్ఆర్ఎం వర్సిటీ తరపున రిజిస్ట్రార్ ఆర్ ప్రేమ్ కుమార్, విష్ణు గ్రూప్ తరపున డాక్టర్ రవిచంద్ర రాజగోపాల్ లు బుధవారం ఎంవోయూ పత్రాలపై సంతకాలు చేశారు. ఐదేళ్ల పాటు కొనసాగే ఈ ఒప్పందంలో సైంటిఫిక్ రీసెర్చ్, రీసెర్చ్ ఫండింగ్, అకడమిక్ యాక్టివిటీస్, వర్క్ షాప్స్ నిర్వహణ, జాయింట్ మెంటారింగ్ వంటి కీలక అంశాల్లో రెండు విద్యా సంస్థల మధ్య పరస్పర సహకారం ఉంటుంది.

ఈ సందర్భంగా ఎస్ఆర్ఎం వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య సతీష్ కుమార్, రీసెర్చ్ డీన్ డాక్టర్ రంజిత్ థాపాలు యూనివర్సిటీ పరిశోధనల్లో పురోగతి, పేటెంట్స్, రీసెర్చ్ ఫండ్స్, పబ్లికేషన్స్ గురించి వివరించారు. యూనివర్సిటీలో ఉన్న సదుపాయాలు, పరిశోదనలకు దోహదపడే అంశాలను వివరించారు. అదేవిధంగా శ్రీ విష్ణు గ్రూప్ వైస్ చైర్మన్ రవిచంద్ర రాజగోపాల్ తమ విద్యా సంస్థ ప్రగతిని వివరించి విష్ణు గ్రూప్ కింద పనిచేస్తున్న పరిశ్రమలు, ఫుడ్, ప్రింటింగ్ వ్యాపారాలను వివరించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, నర్సాపురం పరిసరాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో నిర్వహించే విద్యార్థుల అవగాహన, సామాజిక సేవా కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్బంగా ఎస్ఆర్ఎం వైస్ ఛాన్సలర్ డాక్టర్ సతీష్ కుమార్ ఎస్వీఈఎస్ వైన్ చైర్మన్ రవిచంద్రను సత్కరించి జ్ఞాపికను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఎం వర్సిటీ డీన్లు డాక్టర్ టామ్, డాక్టర్ రమణారావు, డాక్టర్ విష్ణుఫర్, డాక్టర్ వినాయక్ లతో పాటు ప్రొఫెసర్లు డాక్టర్ మహేశ్, డాక్టర్ హరీష్ లు పాల్గొన్నారు. శ్రీ విష్ణు గ్రూప్ నుంచి డాక్టర్ రవీంద్రబాబు, రాజు యడ్ల, శ్రీనివాసరావు, ఐ ఆరికి రాజు, ప్రసాదరాజులు పాల్గొన్నారు.

Tags:    

Similar News