తిరుమలలో శ్రీవారి భక్తులు ఆందోళన

* ఆలయ సిబ్బందితో శ్రీవాణి ట్రస్టు భక్తుల వాగ్వాదం * దర్శనానికి రూ.11వేలు చెల్లిస్తే సిబ్బంది గెంటేశారంటూ ఆరోపణలు * ప్రత్యేక రోజులు కావడంతో..అందరికీ మహాలఘు దర్శనమేనంటున్న టీటీడీ

Update: 2020-12-26 06:40 GMT

తిరుమలలో శ్రీవారి భక్తులు ఆందోళన బాట పట్టారు. ఆలయ సిబ్బంది తమను తోసేశారంటూ శ్రీవాణి ట్రస్టు భక్తులు ఆరోపిస్తున్నారు. దర్శనానికి 11వేల రూపాయలు చెల్లిస్తే.. వెనక్కి పంపేశారంటూ నిరసన తెలుపుతున్నారు. అయితే ప్రత్యేక రోజులు కావడంతో అందరికీ మహాలఘు దర్శనమేనంటుంది టీటీడీ. అంతేకాదు దానికి సంబంధించిన సమాచారాన్ని టికెట్ల రూపంలో పొందుపర్చామంటూ భక్తులకు సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆలయ భద్రతా సిబ్బంది.

Tags:    

Similar News