శ్రీసత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మార్వో ముర్సావలి సస్పెన్షన్‌

మంత్రులు, ఉన్నతాధికారుల పర్యటనకు రూ.లక్షల్లో.. ఖర్చు అవుతోందని ఎమ్మార్వో మాట్లాడిన వీడియో వైరల్‌

Update: 2023-12-25 05:22 GMT

శ్రీసత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మార్వో ముర్సావలి సస్పెన్షన్‌

Andhra News: సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మార్వో ముర్సావలిపై సస్పెన్షన్ వేటు పడింది. మంత్రులు, ఉన్నతాధికారుల పర్యటనకు లక్షల్లో ఖర్చు అవుతోందని ఎమ్మార్వో మాట్లాడిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మెళవాయి గ్రామానికి చెందిన ఓ రైతు.. తన పొలం సమస్యను ఎమ్మార్వో ముందు పెట్టాడు. సమస్యను పరిష్కరించాలని కోరాడు. అయితే.. ఆ రైతు సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మార్వో లంచం డిమాండ్‌ చేశాడు.

లంచం ఇచ్చేందుకు రైతు నిరాకరించడంతో.. ఎటకారంగా మాట్లాడాడు. మంత్రులు, ఉన్నతాధికారుల పర్యటనకు లక్షల్లో ఖర్చు అవుతోందని, లంచాలు తీసుకోకుండా ఆ డబ్బంతా నా జీతం నుంచి ఖర్చు పెట్టాలా అంటూ.. రైతుకు సమాధానం చెబుతున్న ఎమ్మార్వో వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో.. ఎమ్మార్వో తీరుపై ఆ రైతు.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సీరియస్‌గా స్పందించిన కలెక్టర్‌ అరుణ్‌బాబు.. ఎమ్మార్వోను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags:    

Similar News