Srisailam Temple: శ్రీశైలం మల్లన్నసన్నిధిలో స్పర్శదర్శనం నిలిపివేత
Srisailam Temple: కార్తీక మాసం ముగిసేదాకా అలంకార దర్శనానికి అనుమతి
Srisailam Temple: శ్రీశైలం మల్లన్నసన్నిధిలో స్పర్శదర్శనం నిలిపివేత
Srisailam Temple: కార్తీక మాసంలో పెరిగిన భక్తుల రద్ధీతో శ్రీశైలం మల్లన్న సన్నిధిలో స్పర్శదర్శనాన్ని నిలిపివేస్తు్న్నట్లు ఈవో లవన్న తెలిపారు. కార్తీక మాసం ముగిసేదాకా అలంకార దర్శనానికే అనుమతివ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. భక్తులందరికీ సౌకర్యవంతంగా దర్శనభాగ్యం కల్పించేందుకు ఆర్జితసేవలు, స్పర్శదర్శనాలు నిలిపివేస్తున్నామని పేర్కొన్నారు. ముందస్తుగా దర్శనటిక్కెట్లను పొందిన వారికి మాత్రం ఇవాళ స్పర్శదర్శనానికి అనుమతించే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇప్పటికే గర్భాలయ దర్శనం, సామూహిక అభిషేకాలను నిలిపివేశారు. మరో అరు రోజుల పాటు మల్లన్న సన్నిధిలో స్పర్శదర్శనానికి అనుమతించరనే విషయాన్ని భక్తులు గుర్తించాలని ఈవో లవన్న విజ్ఞప్తి చేశారు.