Srikakulam District Collector J.Nivas: కరోనాపై అప్రమత్తంగా ఉండండి

Srikakulam District Collector J.Nivas: కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు.

Update: 2020-07-31 11:00 GMT
Srikakulam District Collector J.Nivas

Srikakulam District Collector J.Nivas: కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. శుక్రవారం మెలియాపుట్టి లో శ్రీ కమలా కళ్యాణ మండపంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కంటోన్మెంట్ ప్రాంతాలలో అధికారులంతా అప్రమత్తంగా ఉండి ప్రజలు ఇంటి నుండి బయటకు రాకుండా చూడాలని, వారికి కావాల్సిన సౌకర్యాలు సమకూర్చాలి అని అన్నారు. 60 సంవత్సరాలు దాటిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అవసరమనుకుంటే వారికి పాతపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని అన్నారు.

కోవిడ్ పరీక్షలు చేయించుకున్న వారు పదిహేను రోజులపాటు ఇంటికే పరిమితం కావాలని, బయటికి వచ్చినట్లయితే వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. కోవిడ్ పరీక్షలు చేయించుకున్న వారి ఇళ్లకు ప్రతిరోజు ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, వెళ్లి వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను నమోదు చేయాలని అన్నారు. అనంతరం చాపర కంటోన్మెంట్ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు పలు సలహాలు, సూచనలు అందించారు. ఆయనతో పాటు ఆర్డీఓ టి.వి.ఎస్ జి.కుమార్ మండల స్పెషల్ ఆఫీసర్ టి.భవాని శంకర్ ఎంపీడీవో పి.చంద్ర కుమారి డిప్యూటీ తహసీల్దారు బి.ప్రసాదరావు, ఈఓపిఆర్డీ రమేష్, వైద్యాధికారులు జి.గణపతిరావు, ప్రసాద్ రెడ్డి, శివ కుమార్ పలువురు అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News