కరోనాపై పోరుకు సత్యసాయి ట్రస్ట్‌ భారీ విరాళం.. ఏపీ సీఎం సహాయనిధికి ఇవాళ భారీగా విరాళాలు

Update: 2020-04-04 11:48 GMT

కరోనా వైరస్ మహమ్మారిపై ఏపీ సర్కార్‌ చేస్తున్న పోరాటానికి సత్యసాయి ట్రస్టు తన వంతు సహకారం అందించింది. ఈ మేరకు సీఎం సహాయ నిధికి రూ. 5 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి శ్రీసత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ రూ. 5 కోట్ల చెక్కు అందజేశారు. ఈ మొత్తాన్ని కరోనా నివారణ చర్యల కోసం వినియోగించాలని కోరారు. 

ఏపీ సీఎం సహాయనిధికి ఇవాళ భారీగా విరాళాలు

ముఖ్యమంత్రి సహాయనిధికి పెన్నా సిమెంట్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌.జగన్‌కు రూ.2 కోట్ల చెక్‌‌ను పెన్నా సిమెంట్స్‌ ఛైర్మన్‌ పెన్నా ప్రతాప్‌ రెడ్డి అందించారు. ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ కూడా కోటి రూపాయిలు విరాళాలు ప్రకటించింది. ఇవాళ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ డా. సాంబశివారెడ్డి, డా.చంద్రశేఖర్‌రెడ్డిలు కోటి రూపాయిల చెక్‌ను సీఎం జగన్‌కు అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రభుత్వ జూనియర్, డిగ్రీ , పాలిటెక్నిక్‌ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్లు రెండు రోజుల వేతనంను రూ.1.15 కోట్లు విరాళం ప్రకటించారు. ఇవాళ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జగన్‌ను కలిసి విరాళానికి సంబంధించిన వివరాలు అందజేశారు.





Tags:    

Similar News