Anantapur: కనుల పండువగా గవిమఠం శ్రీచంద్రమౌళీశ్వర స్వామి రథోత్సవం
Anantapur: రథంపై పూలు, పండ్లు విసిరి మొక్కులు తీర్చుకున్న భక్తులు
Anantapur: కనుల పండువగా గవిమఠం శ్రీచంద్రమౌళీశ్వర స్వామి రథోత్సవం
Anantapur: అనంతపురం జిల్లా ఉరవకొండ గవిమఠం శ్రీచంద్రమౌళీశ్వర స్వామి రథోత్సవం కనుల పండువగా సాగింది. భారీగా భక్తులు తరలి రావడంతో గవిమఠ ప్రాంగణం కిటకిటలాడింది. శివనామస్మరణల మధ్య చంద్రమౌళీశ్వరస్వామి మహారథోత్సవం కమనీయంగా జరిగింది. భక్తులు రథంపై పూలు, పండ్లు విసిరి తమ మొక్కులు తీర్చుకున్నారు.