ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: సోము వీర్రాజుకు అవకాశం ఇచ్చిన బీజేపీ
Somu Veerraju: సోము వీర్రాజు పేరును ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవికి బీజేపీ నాయకత్వం సోమవారం ప్రకటించింది.
Somu Veerraju: సోము వీర్రాజు పేరును ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవికి బీజేపీ నాయకత్వం సోమవారం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో ఐదు ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి దక్కించుకోనున్నాయి. జనసేన తరపున సినీ నటులు నాగబాబు మార్చి 8న నామినేషన్ దాఖలు చేశారు.
టీడీపీ తరపున బీద రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మ, బీటీ నాయుడులకు ఆ పార్టీ నాయకత్వం అవకాశం కల్పించింది. మరో స్థానాన్ని బీజేపీకి కేటాయించింది. బీజేపీ నాయకత్వం ఎమ్మెల్సీ స్థానానికి పార్టీ తరపున సోము వీర్రాజుకు మరోసారి అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్చి 10న ఆ పార్టీ నాయకత్వం సోము వీర్రాజు పేరును కమలం పార్టీ ప్రకటించింది.నామినేషన్ల దాఖలుకు సోమవారమే చివరి తేది.
ఆంధ్రప్రదేశ్‌లో బీటీ నాయుడు, ఆశోక్ బాబు, యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు పదవీ కాలం ఈ నెల 29తో పూర్తి కానుంది. దీంతో ఎన్నికల కమిషన్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధింది షెడ్యూల్ ను ప్రకటించింది.