Somu Veerraju: హిందువుల మనోభావాలను దెబ్బ తీయడమే వైసీపీ పనిగా పెట్టుకుంది
Somu Veerraju: గుంటూరులో అగ్రహారం పేరు రాత్రి కి రాత్రి ఫాతిమా పేరుతో.. బోర్డు పెట్టడంలో ప్రభుత్వం ఉద్దేశం ఏమిటని ఆయన ప్రశ్నించారు
Somu Veerraju: హిందువుల మనోభావాలను దెబ్బ తీయడమే వైసీపీ పనిగా పెట్టుకుంది
Somu Veerraju: ఆంధ్రప్రదేశ్ బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోమువీర్రాజు జగన్ ప్రభుత్వం తీరుపై కీలక వ్యాఖ్యలు చేసారు. హిందువుల మనోభావాలను దెబ్బ తీయడమే వైసీపీ పని గా పెట్టుకుందన్నారు. గుంటూరులో అగ్రహారం పేరు రాత్రి కి రాత్రి ఫాతిమా పేరుతో బోర్డు పెట్టడంలో ప్రభుత్వం ఉద్దేశం ఏమిటని ఆయన ప్రశ్నించారు. విశాఖ నగరంలో సీతమ్మ కొండ పేరు మార్చడం, ప్రొద్దుటూరు లో టిప్పుసుల్తాన్ విగ్రహం పెట్టాలని ప్రయత్నించడం ఏంటిన్నారు. ఈ తరహా సంఘటనలుకు ఎవరు సూత్రధారి ముస్లిం ల కోసం చట్టాలు మారుస్తామని ప్రకటిస్తున్నారన్నారు. అదేవిధంగా హిందూ ఎస్సీ లకు వ్యతిరేకంగా ప్రభుత్వ పోకడలు చూస్తే హిందువుల పై దాడులకు తెగబడే విధంగా వైసీపీ వ్యవహరిస్తోంది ఆయన విమర్శించారు.