Somu Veerraju: వైసీపీ అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి
Somu Veerraju: రాజధాని ఉద్యమానికి మద్దతు తెలిపితే దాడులు చేస్తారా?
Somu Veerraju: వైసీపీ అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి
Somu Veerraju: వైసీపీ అరాచకాలకు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. రాజధాని ఉద్యమానికి మద్దతు తెలిపితే.. తమ కార్యకర్తల మీద దాడులు చేశారని ఆరోపించారు. బద్వేల్‌లో పోటీ చేసిన తమ అభ్యర్థి సురేష్‌పై కూడా వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారన్నారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరుగుతున్నా.. వాళ్లు పట్టించుకోలేదన్నారు. దాడి ఘటనపై కేంద్ర పార్టీకి నివేదిక పంపించామని.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని సోము వీర్రాజు తెలిపారు. అమరావతిని రాజధానిగా ఒప్పుకున్న వైసీపీ.. ఇప్పుడెందుకు మూడు రాజధానులంటూ మాట్లాడుతుందని ప్రశ్నించారు. కర్నూల్‌లో హైకోర్టు పెట్టాలన్న డిమాండ్‌కు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు.