West Godavari: ఆర్టీసీ బస్సులో పొగలు.. డ్రైవర్ సమయస్ఫూర్తితో తప్పిన ప్రమాదం
West Godavari: సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు...
West Godavari: ఆర్టీసీ బస్సులో పొగలు.. డ్రైవర్ సమయస్ఫూర్తితో తప్పిన ప్రమాదం
West Godavari: పశ్చిమగోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సు ఇంజిన్ నుంచి దట్టమైన పొగలు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తణుకు నుండి రాజమండ్రి వెళ్తున్న బస్సు నిడదవోలు మండలం విజ్జేశ్వరం బ్యారేజి దగ్గరకు చేరుకున్న తర్వాత పొగలు రావడంతో ప్రయాణికులు కేకలు వేశారు.
వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డుపైనే నిలిపి వేసి ప్రయాణికులను కిందకు దించారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న స్థానికులు పక్కనే ఉన్న జాలర్ల సహాయంతో ఘటనా స్థలానికి చేరుకుని పొగేలను అదుపు చేశారు. మరో బస్సులో ప్రయాణికులను రాజమండ్రికి తరలించారు. ప్రమాదానికి గురైన బస్సును తణుకు ఆర్టీసీ గ్యారేజీకి తరలించారు.