అనంతలో విషాదం: ట్రాక్టర్‌పై కరెంట్‌ తీగలు తెగిపడి ఆరుగురు కూలీల దుర్మరణం

Anantapur: అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది.

Update: 2022-11-02 10:00 GMT

అనంతలో విషాదం: ట్రాక్టర్‌పై కరెంట్‌ తీగలు తెగిపడి ఆరుగురు కూలీల దుర్మరణం

Anantapur: అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బొమ్మనహల్లు మండలం దర్గా హొన్నూరులో విద్యుత్ తీగలు తెగిపడటంతో ఆరుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పంట పొలం పనులు ముగించుకుని ట్రాక్టర్‌లో తిరిగి వస్తుండగా.. 11 కేవీ విద్యుత్ తీగలు ట్రాక్టర్‌కు తగలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో దర్గాహోన్నూరులో విషాదఛాయలు అలముకున్నాయి.

Tags:    

Similar News