Chandrababu Naidu: సీఎం కీలక వ్యాఖ్యలు.. సింపుల్ గవర్నమెంట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్ నా విధానం..
Chandrababu Naidu: అధికారులు ఫిజికల్.. వర్చ్యువల్ పని విధానాలకు సిద్దపడాలి
Chandrababu Naidu: సీఎం కీలక వ్యాఖ్యలు.. సింపుల్ గవర్నమెంట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్ నా విధానం..
Chandrababu Naidu: రాష్ట్రం పేదరిక నిర్మూళనకు కుప్పం నుంచే శ్రీకారం చుడదామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. పేదరిక నిర్మూళనకు కుప్పం నియోజకవర్గం నుండే శ్రీకారం చుట్టబోతున్నామన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా జిల్లా అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. సింపుల్ గవర్నమెంట్...ఎఫెక్టివ్ గవర్నెన్స్ తన విధామని అధికారులకు తెలియజేశారు. గత యంత్రాంగానికి.. ఇప్పటి యంత్రాంగానికి చాలా వ్యత్యాసం ఉండబోతుందన్నారు. అధికారులు ఫిజికల్... వర్చ్యువల్ పని విధానాలకు సిద్దపడాలన్నారు. కుప్పం అభివృద్ధికి సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని.. అధికారులను ఆదేశించారు. కుప్పంలో రౌడీయిజం, హిసం, గంజాయి, అక్రమాలు కనిపించకూడదన్నారు. రానున్న రోజుల్లో కుప్పంలో అమలు చేయబోయే ప్రణాళికపై అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.