Simhachalam: అప్పన్న చందనోత్సవం.. దర్శనం కోసం బారులు తీరిన భక్తులు

Simhachalam: తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన దర్శనాలు

Update: 2023-04-23 03:45 GMT

Simhachalam: అప్పన్న చందనోత్సవం.. దర్శనం కోసం బారులు తీరిన భక్తులు

Simhachalam: ఏడాది మొత్తం చందనం పూతలో వుండే సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి ఇవాళ భక్తులకు నిజరూపంలో దర్శనమిస్తున్నారు. చందనోత్సవంగా పేర్కొనే ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. వరాహ-నారసింహ అవతారాల సమ్మేళనంగా అలరారుతున్న సింహాద్రినాథుడి నిజరూపాన్ని కనులారా వీక్షించడం మహద్భాగ్యంగా భక్తులు భావిస్తారు. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. తెల్లవారుజాము నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. అశోక్‌ గజపతిరాజు కుటుంబ సభ్యులు తొలి దర్శనం చేసుకున్నారు. ప్రభుత్వం, టీటీడీ తరపున వైవీ సుబ్బారెడ్డి, మంత్రి సత్యనారాయణ పట్టువస్త్రాలు సమర్పించారు.

Tags:    

Similar News