వాగులో పడి ఆరుగురు విద్యార్థులు మృతి

పచ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు(మ) వసంతవాడలో తీవ్ర విషాదం నెలకొంది. వాగులో పడిన ఆరుగురు విద్యార్థులు విగతజీవులుగా మారారు.

Update: 2020-10-28 13:27 GMT

పచ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు(మ) వసంతవాడలో తీవ్ర విషాదం నెలకొంది. వాగులో పడిన ఆరుగురు విద్యార్థులు విగతజీవులుగా మారారు. సరదాగా ఈత కొట్టేందుకు వాగులోకి దిగిన గొట్టుపర్తి మనోజ్‌(16), కోనవరపు రాధాకృష్ణ(16), కర్నాటి రంజిత్‌(16), శ్రీరాముల శివాజి(17), గంగాధర్‌ వెంకట్‌(17), చల్లా భువన్‌(18)లు గల్లంతయ్యారు. గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టి గల్లంతైన వారి మృతదేహాలను వెలికితీశారు. ముందుగా రెండు, ఆ తర్వాత మరో రెండు మృతదేహాలు లభ్యం కాగా.. మిగతా విద్యార్థులు జీవించే ఉంటారని అంతా భావించారు.

అయితే మొత్తం ఆరుగురు విద్యార్థులు మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు నెలకొనగా.. విహారయాత్ర చివరకు ఇలా విషాదయాత్రగా మారింది. దేవీ శరన్నవ‌రాత్రులను పురస్కరించుకుని వ‌సంత‌వాడ‌కు చెందిన కొన్ని కుటుంబాలు వాగు స‌మీపంలో వ‌న‌భోజ‌నాల‌కు వెళ్లారు. అక్కడ ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక విద్యార్థుల మృతి పట్ల రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ సంతాపం తెలిపారు. ఈత కొట్టేందుకు వాగులోకి వెళ్ళిన చిన్నారులు ప్రాణాలు కోల్పోవటం బాధాకరమన్నారు గవర్నర్.. పిల్లల విషయంలో ఏమరుపాటు తగదని అయన హితవు పలికారు.. 

Tags:    

Similar News