ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం
*దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు.. నెల్లూరు తీరప్రాంతంపై ఎక్కువ ప్రభావం
ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం
Weather Updates: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేటి రాత్రి తుఫాన్‌గా మారనుంది. వాయుగుండం శ్రీలంకకు 410 కిమీ దూరంలో కేంద్రీకృతమైంది. తమిళనాడుకు 370 కిలో మీటర్ల దూరంలో మండూస్ తుఫాన్ ప్రభావం ఉండనుంది. దీంతో తమిళనాడు, పుదుచ్చేరికి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ఎల్లో హెచ్చరిక జారీ చేశారు.
ఈ మండూస్ తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నెల్లూరు తీరప్రాంతంపై ఎక్కువ మండూస్ తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నెల్లూరు చేరుకున్నాయి. మత్స్యకారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. తీరం వెంబడి గంటకు 75 నుంచి 80 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.