ఏపీ గవర్నర్‌ను కలిసిన ఎస్ఈసీ రమేశ్ కుమార్

Update: 2020-03-16 06:01 GMT

ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ హరిచందన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ కలిశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు గల కారణాలను వివరించారు. ఏ పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం. ఎస్‌ఈసీ నిర్ణయంపై ముఖ్యమంత్రి జగన్‌ ఇప్పటికే గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీని రాజ్‌భవన్‌కు పిలిపించి గవర్నర్‌ మాట్లాడారు.

కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసిన నేపథ్యంలో స్టేట్ ఎలక్షన్‌ కమిషన్‌కు ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని లేఖ రాశారు. ఎన్నికలు యథావిధిగా చేపట్టేందుకు కార్యాచరణ చేపట్టాలని విన్నవించారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి లేదని పరిస్థితి అదుపులోనే ఉందని వివరించారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోందని లేఖలో వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు అడ్డంకి లేకుండా కరోనా నియంత్రణ చర్యలు చేపట్టవచ్చని పేర్కొన్నారు. పోలింగ్‌ రోజున జనం గుమిగూడకుండా నియంత్రించవచ్చని తెలిపారు. మరో 3,4 వారాలపాటు కరోనా నియంత్రణలోనే ఉంటుందని లేఖలో తెలిపారు.

Full View


Tags:    

Similar News