భయపడొద్దు.. దుందుడుకు చర్యలకు పాల్పడే వారిని ఉపేక్షించం- నిమ్మగడ్డ

Update: 2021-02-06 14:44 GMT

నిమ్మగడ్డ ఫైల్ ఫోటో 

పంచాయతీ ఎన్నికల సిబ్బందిని బెదిరించే ప్రకటనలు చేయడం అనైతికమని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఆక్షేపించారు. . ఎన్నికల సిబ్బందిని అస్థిరపరిచే చర్యలను ఏమాత్రం ఉపేక్షించబోమన్నారు. వ్యక్తులు ఎవరైనా తాత్కాలికమేనని, వ్యవస్థలే శాశ్వతమన్న నిజాలను గుర్తించాలని నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ సూచించారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకున్నా ఎస్‌ఈసీ ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, దీనిపై సుప్రీంకోర్టు నుంచి కూడా స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని వివరించారు.

ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, ఇతర సిబ్బందికి రాజ్యాంగ రక్షణ ఉంటుందని, ఎలాంటి అభద్రత అవసరం లేదని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ భరోసా ఇచ్చారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులపై ముందస్తు అనుమతి లేకుండా చర్యలను నిషేధిస్తూ త్వరలోనే ఉత్తర్వులు జారీచేస్తామన్నారు. ఎన్నికల సిబ్బందిని బెదిరించే ప్రకటనలు అవాంఛనీయమని, అధికారులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు అనైతికమని ఆక్షేపించారు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు ఎస్‌ఈసీ రక్షణ కవచంలో ఉంటారని నిమ్మగడ్డ ప్రకటించారు.

Tags:    

Similar News