తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ
* నిమ్మగడ్డ కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనం అందించిన పండితులు
SEC Nimmagadda Ramesh
తిరుమల శ్రీవారిని ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో రమేష్ కుమార్ కుటుంబ సభ్యులకు వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. రమేష్ కుమార్ ను పట్టువస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.