ఏపీ గవర్నర్‌ను కలిసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ
* ప్రభుత్వ వైఖరిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన రమేష్ కుమార్ * ఉద్యోగుల అభ్యంతరాలు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై కీలక చర్చలు
SEC Ramesh Kumar Meets Andhra Pradesh Governor
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల హీట్ కొనసాగుతోంది. ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌బెంచ్ ఆదేశాలు ఇచ్చిన నేపధ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. పంచాయితీ ఎన్నికల షెడ్యూల్, ప్రభుత్వ వైఖరిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన నిమ్మగడ్డ ఉద్యోగుల అభ్యంతరాలు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై కీలక చర్చలు జరిపారు