Andhra Pradesh: ఈ నెల 18న మేయర్ల ఎన్నిక
Andhra Pradesh: ఈ నెల 18న మేయర్లు, మున్సిపల్ చైర్మన్‌ల ఎన్నిక * 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాల్టీల్లో ఎన్నిక నిర్వహణ
ఎస్ఈసీ రమేష్ (ఫైల్ ఫోటో)
Andhra Pradesh: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 18న మేయర్లు, మున్సిపల్ చైర్మన్‌ల ఎన్నిక నిర్వహించనున్నారు. దీంతో ఏలూరు మినహా ఎన్నికలు జరిగిన 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాల్టీల్లో ఎన్నిక జరగనుంది. గెలిచిన అభ్యర్థుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం అనంతరం ఎన్నిక ప్రక్రియ కొనసాగనుంది. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఎక్స్ అఫీషియో హోదాలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఈ విషయమై గుర్తింపు కలిగిన పార్టీలకు ఎస్‌ఈసీ విప్ జారీ చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.