Inspecting Ration Delivery Vehicles
ఏపీలో రేషన్ డెలివరీ వాహనాలను మొదట ఎస్‌ఈసీ కార్యాలయానికి తరలించారు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ రేషన్ డెలివరీ వాహనాలను పరిశీలించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉండటంతో ఎస్‌ఈసీ తనిఖీ చేశారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు విజయవాడలోని ఎస్‌ఈసీ కార్యాలయానికి రేషన్ డెలివరీ వాహనాలను తరలించారు పౌరసరఫరాలశాఖ అధికారులు.