Machilipatnam: ఇంకా దొరకని నలుగురు జాలర్ల జాడ.. గాలింపులో మెరైన్, నేవీ, కోస్ట్‌గార్డ్ టీమ్‌లు

Machilipatnam: ఇంకా దొరకని నలుగురు జాలర్ల జాడ.. గాలింపులో మెరైన్, నేవీ, కోస్ట్‌గార్డ్ టీమ్‌లు

Update: 2022-07-07 05:45 GMT

Machilipatnam: ఇంకా దొరకని నలుగురు జాలర్ల జాడ.. గాలింపులో మెరైన్, నేవీ, కోస్ట్‌గార్డ్ టీమ్‌లు

Machilipatnam: చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన నలుగురు మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతోంది. పోలీస్, రెవెన్యూ, ఫిషరీస్, మెరైన్, కోస్ట్ గార్డ్, నేవల్, వాతావరణ శాఖల సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. మచిలీపట్నం జాలర్ల బోటు చివరిగా అంతర్వేదికి 10 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయినట్టు బోటు యజమానికి కాల్ వచ్చింది.

వెంటనే అంతర్వేది స్పాట్ వద్దకు వెళ్ళి చూస్తే బోటు కనిపించలేదంటున్నారు బోట్ ఓనర్. ప్రస్తుతం అంతర్వేది, కరవాక, నరసాపురం చుట్టుపక్కల ప్రాంతాల సముద్రతీరంలో గాలిస్తున్నారు అంతర్వేది మెరైన్ పోలీసులు. ఇప్పటివరకు మత్స్యకారుల బోటు జాడ కనిపించకపోవడంతో అంతర్వేది తీరంలో రెండు మెరైన హెలికాప్టర్లతో గాలింపు చేపట్టారు.

మచిలీపట్నం క్యాంప్‌బెల్‌పేటకు చెందిన చిన్నమస్తాన్‌, చిననాంచారయ్య, నరసింహారావు, మోకా వెంకటేశ్వరరావు గిలకలదిండి నుంచి మరబోటుపై సముద్రంలో వేటకు వెళ్లారు. అయితే ఇప్పటివరకు వారి ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. జాలర్ల సెల్‌ఫోన్‌ కూడా స్విచాఫ్‌ కావడంతో గాలింపు మరింత కష్టంగా మారింది. 

Full View


Tags:    

Similar News