Bapatla: పాఠాలు చెబుతూనే ఆగిన ఉపాధ్యాయుడి గుండె.. కుర్చీలోనే ఉపాధ్యాయుడు మృతి..
Bapatla: గుండెపోటు.. ఇప్పుడు ఈ పదం వినగానే అందరూ హడలిపోతున్నారు.
Bapatla: పాఠాలు చెబుతూనే ఆగిన ఉపాధ్యాయుడి గుండె.. కుర్చీలోనే ఉపాధ్యాయుడు మృతి..
Bapatla: గుండెపోటు.. ఇప్పుడు ఈ పదం వినగానే అందరూ హడలిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో చనిపోతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అప్పటివరకు బాగున్నవారు గుండెపోటుతో చనిపోతున్నారు. ఎప్పుడు, ఎవరికి ఏం జరుగుతుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు. తాజాగా బాపట్ల జిల్లాలో పాఠాలు చెబుతూ ఉపాధ్యాయుడు కుర్చీలోనే గుండెపోటుతో మరణించారు.
శనివారం విధులకు హాజరైన ఉపాధ్యాయుడు వీరబాబు.. విద్యార్థులకు పాఠాలు చెబుతుండగానే గుండెపోటు రావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఇది గమనించిన విద్యార్థులు ఇతర ఉపాధ్యాయులకు సమాచారమిచ్చారు. వారు వెంటనే 108కి ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. దీంతో పాఠశాల విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు విషాదంలో మునిగిపోయారు.