Srisailam: శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

Srisailam: శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

Update: 2023-01-15 09:03 GMT

Srisailam: శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

Srisailam: శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. శ్రీభ్రమరాంబ సమేతుడైన మల్లికార్జునస్వామి రావణవాహనాదీశులై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరిమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం నుండి అర్చకులు వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో రావణవాహనంలో ఆవహింపజేసి అర్చకస్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విద్యుత్ దీప కాంతుల నడుమ కన్నులపండువగా ఆలయ ప్రదక్షిణలు గావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో లవన్న అధికారులు పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు.

Tags:    

Similar News