సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

Update: 2019-01-03 01:50 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. జనవరి 12 నుంచి 20 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని.. తిరిగి ఈ నెల 21న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని తెలిపింది. కాగా 2018-19 విద్యా సంవత్సర క్యాలెండర్‌ ప్రకారం.. జనవరి 8 నుంచి 17 వరకు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇవ్వాల్సి ఉంది. కానీ ప్రభుత్వం జనవరి 2 నుంచి 11 వరకు 'జన్మభూమి' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందున 12 నుంచి 21 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వంసంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్‌దాస్‌ బుధవారం మెమో జారీచేశారు.

సంక్రాంతి సెలవుల తోపాటుగా రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ పాఠశాలల్లో పనిచేస్తున్న 20 మంది ఉపాధ్యాయుల అంతర్‌ రాష్ట్ర బదిలీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీరు ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు 20 మంది బదిలీ కానుండగా.. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌ కు 20 మంది బదిలీ అవుతున్నారు. టీచర్లు పరస్పరం అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

Similar News