Sankranthi celebrations (file image)
చిత్తూరు జిల్లాలో తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి మొదలైంది. చంద్రగిరి మండలం కొత్తశానంబ్ల గ్రామంలో జల్లికట్టు వేడుకలు ప్రారంభం అయ్యాయి. జల్లికట్టు వేడుకలను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భారీగా తరలివచ్చారు. పశువుల కొమ్ములకు కట్టిన బహుమతులు లాక్కొనేందుకు యువకులు పోటిపడ్డారు. మండల కేంద్రానికి సమీపంలో జల్లికట్టు జరుగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.