పరిసరాల శుభ్రత తోనే సంపూర్ణ ఆరోగ్యం: శానిటరీ ఇన్స్పెక్టర్

పరిసరాల శుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని శ్రీకాళహస్తి పురపాలక సంఘ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు అన్నారు.

Update: 2019-12-21 05:49 GMT

శ్రీకాళహస్తి: పరిసరాల శుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని శ్రీకాళహస్తి పురపాలక సంఘ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు అన్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో మలేరియా దోమల నిర్మూలనకు ఎంఎల్ ఆయిల్ ద్వారా నీటి నిల్వలపై మంటలు పెట్టారు. ఇటీవల పట్టణంలోని టీవీ రోడ్డు ప్రాంతంలో డెంగీ జ్వరం వ్యాప్తి చెందాయి. అదే ప్రాంతంలోని అఖిల శ్రీ అనే చిన్నారి డెంగ్యూ మలేరియా ఒకేసారి సోకింది. సమాచారం అందుకున్న పురపాలక పారిశుద్ధ్య విభాగం దోమల నివారణకు చర్యలు చేపట్టింది.

పీవీ రోడ్డు ప్రాంతాల్లోని మురికి కాలువలు, నీటి నిల్వలపై దోమల నియంత్రణకు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రూప్ కాలువల్లో వ్యర్థాలను వేయకూడదు అన్నారు. చెత్త, వ్యర్ధాలను పురపాలక సంఘ సిబ్బందికి నేరుగా అందించాలన్నారు. అలాగే ఇంటి చుట్టుపక్కల నీటి నిల్వ లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మేస్త్రి వాసు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News