Sajjala Ramakrishna: వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సజ్జల రామకృష్ణారెడ్డి
Sajjala Ramakrishna: కడప జిల్లా రాజంపేట మండలంలో పర్యటన
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సజ్జల రామకృష్ణ (ఫైల్ ఇమేజ్)
Sajjala Ramakrishna: కడప జిల్లా రాజంపేట వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పర్యటించారు. స్దానిక ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ఇతర అదికారులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలైన పులపుత్తూరు, మందపల్లి, అన్నమయ్య ప్రాజెక్ట్ ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్బంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఒక్కసారిగా వరద రావడం వల్ల ఇంత నష్టం జరిగిందని, కానీ ప్రాణ నష్టాన్ని నివారించగలిగామన్నారు. త్వరలోనే సిఎం వైఎస్ జగన్ కూడా పర్యటించనున్నారని, వరద బాధితులకు మరింత సహాయాన్ని ప్రకటించే అవకాశం ఉందని చెప్పారు.