Sajjala Ramakrishna Reddy: మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం
Sajjala Ramakrishna Reddy: మూడు రాజధానులపై సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ
Sajjala Ramakrishna Reddy: మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం
Sajjala Ramakrishna Reddy: అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ ప్రభుత్వ విధానం అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విశాఖ.. పరిపాలన రాజధానిగా ఉంటుందని, అమరావతిలో అసెంబ్లీ, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు. పాలనా వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. రియల్ ఎస్టేట్ కోసం కొందరు వాదనలు చేస్తున్నారు. ఎవరూ అపోహలకు గురికావాల్సిన పనిలేదన్నారు. అధికార వికేంద్రీకరణ చేయాలని శివరామకృష్ణ కమిటీ చెప్పలేదా? అని ప్రశ్నించారు. వచ్చిన అవకాశాన్ని వదులుకుని చంద్రబాబు ఘోర తప్పిదం చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు.