Sajjala Ramakrishna: షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వెనుక చంద్రబాబు హస్తం ఉంది
Sajjala Ramakrishna: అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగించడంపై సరైనదే
Sajjala Ramakrishna: షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వెనుక చంద్రబాబు హస్తం ఉంది
Sajjala Ramakrishna: వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరడంపై సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు హస్తం ఉందని చెప్పారు. ఆమె కాంగ్రెస్ లో చేరడం వల్ల వైసీపీకి ఎలాంటి నష్టం లేదని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదని... ఆ పార్టీని తాము పట్టించుకోబోమని తెలిపారు. షర్మిలకు ఎక్కడి నుంచైనా పోటీ చేసే హక్కు ఉందని అన్నారు. అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగించడంపై సజ్జల రామకృష్ణారెడ్డి సమర్ధించారు.అంగన్‌వాడీల్లో చిన్న పిల్లలు, గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. తిరిగి వీధుల్లో చేరాలని విజ్ఞప్తి చేసినా.. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించడంతో ఎస్మా చట్టాన్ని ప్రయోగించమన్నారు.