అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఆర్టీసీ బస్సుపై దాడి
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఆర్టీసీ బస్సుపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అమలాపురం, కాకినాడ మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఆర్టీసీ బస్సుపై దాడి
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఆర్టీసీ బస్సుపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అమలాపురం, కాకినాడ మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమలాపురం కిమ్స్ ఆస్పత్రి వద్ద మురమళ్ల గ్రామానికి చెందిన ఓ యువతి ఆర్టీసీ బస్సు ఎక్కింది. చాలా సేపటికి కూడా యువతి టికెట్ తీసుకోకపోవడంతో గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో అనాతవరం సమీపంలో యువతిని రోడ్డుపై దించేసి వెళ్లిపోయారు. విషయం బంధువులకు చెప్పడంతో మురమళ్ల వద్ద గ్రామస్థులు బస్సును ఆపి అద్దాలు ధ్వంసం చేశారు. అనంతరం డ్రైవర్, కండక్టర్లపైనా దాడికి యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఘర్షణపై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.