AP News: పల్నాడు జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్‌కు దేహశుద్ది

AP News: పల్నాడు జిల్లాలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు దేహశుద్ధి జరిగింది.

Update: 2022-11-14 07:14 GMT

AP News: పల్నాడు జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్‌కు దేహశుద్ది

AP News: పల్నాడు జిల్లాలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు దేహశుద్ధి జరిగింది. మహిళా ప్రయాణికురాలి పట్ల ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ అసభ్యకరంగా ప్రవర్తించడంతో చితకబాదారు. విజయవాడ నుంచి వినుకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మహిళా ప్రయాణికురాలి పట్ల డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. జరిగిన విషయాన్ని బాధితురాలు తన బంధువులకు ఫోన్‎లో చెప్పారు. నర్సారావుపేట బస్టాండ్‌ దగ్గరకు చేరుకున్న బంధువులు బస్సు రాగానే డ్రైవర్‌ శ్రీనివాస్‌ను చితక్కొట్టారు. అనంతరం ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో డ్రైవర్‌పై విచారణ చేస్తామని, మహిళపై అసభ్యంగా ప్రవర్తించినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పడంతో మహిళ కుటుంబసభ్యులు వెళ్లిపోయారు.

Tags:    

Similar News