RTC Bus Fire: మంటల్లో కాలిబూడిదైన ఆర్టీసీ బస్సు.. తప్పిన పెనుప్రమాదం
RTC Bus Fire: క్షణాల వ్యవధిలోనే బస్సు మొత్తం వ్యాపించిన మంటలు
RTC Bus Fire: మంటల్లో కాలిబూడిదైన ఆర్టీసీ బస్సు.. తప్పిన పెనుప్రమాదం
RTC Bus Fire: విజయవాడలో పెను ప్రమాదం తప్పింది. వెంట్రప్రగడ సమీపంలో షార్ట్ సర్క్యూట్‌తో పల్లె వెలుగు బస్సులో మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్.. ప్రయాణికులను బస్సులో నుంచి కిందకు దింపేశాడు. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు అందరూ చూస్తుండగానే బస్సు మంటల్లో కాలిబూడిదైంది. గుడివాడ మానికొండ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది.