రాయచోటిలో పంచాయితీ రాజ్ రోడ్లకు మహర్దశ

ఉపముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రంలోని పంచాయతీ రాజ్ రోడ్లకు మహర్దశ పట్టనుంది. ఈ నేపథ్యంలో, అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గ రూపు రేఖలు మార్చేందుకు ఉప ముఖ్యమంత్రి రోడ్లను మంజూరు చేశారు.

Update: 2025-12-11 09:57 GMT

అమరావతి: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రంలోని పంచాయతీ రాజ్ రోడ్లకు మహర్దశ పట్టనుంది. ఈ నేపథ్యంలో, అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గ రూపు రేఖలు మార్చేందుకు ఉప ముఖ్యమంత్రి రోడ్లను మంజూరు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉప ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో మొత్తం 38.08 కిమీ మేరకు 12 గ్రామీణ రహదారులకు రూ. 21.16 కోట్లు పంచాయతీ రాజ్ శాఖ మంజూరు చేసింది. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అమరావతిలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ను, హోం మంత్రి అనితను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోడ్ల నిర్మాణం ద్వారా రాయచోటిలో గ్రామీణ రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందుతాయని, రవాణా రంగానికి కొత్త ఊపు వస్తుందని మంత్రి తెలిపారు.

Tags:    

Similar News