Roja: జగనన్న ప్రభుత్వాన్ని బాలకృష్ణ ఎమర్జెన్సీ సర్కార్ అనడం హాస్యాస్పదం
Roja: ఎవరయినా స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడారా..? లేక తెలియక మాట్లాడారా
Roja: జగనన్న ప్రభుత్వాన్ని బాలకృష్ణ ఎమర్జెన్సీ సర్కార్ అనడం హాస్యాస్పదం
Roja: ఇటీవల చంద్రబాబు సభలో 11 మంది చనిపోతే మాట్లాడని హిందూపురం ఎమ్మె్ల్యే, సినీ నటుడు బాలకృష్ణ వైసీపీ ప్రభుత్వంపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. ఎవరయినా స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడారా.. లేక తెలియక మాట్లాడారా.. అనేది అర్ధం కావడం లేదన్నారామె.... జగనన్న ప్రభుత్వాన్ని ఎమర్జెన్సీ సర్కార్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత ప్రభుత్వ పనితీరు చూసిన బాలకృష్ణ.. ఇంకా ఎమర్జెన్సీలో లాగా ఉందనుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు భ్రమలో నుంచి బాలకృష్ణ బయటకు రావాలని రోజా హితవు పలికారు. బాలకృష్ణ, పవన్‌కల్యాణ్ జీవో నెంబర్ వన్‌ను పూర్తిగా చదివారా అని రోజా ప్రశ్నించారు.