Road Accident: కారును ఢీకొట్టిన బొలెరో వాహనం.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు
Road Accident: శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం
Road Accident: కారును ఢీకొట్టిన బొలెరో వాహనం.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు
Road Accident: శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం టేకులోడు మలుపు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం ఫార్చునర్ వాహనాన్ని ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. హిందూపురం నుంచి అతివేగంగా వస్తున్న బొలెరో ఫార్చునర్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరోలో ప్రయాణిస్తున్న శంకర రెడ్డి అనే రైతు అక్కడికక్కడే చనిపోయాడు. ఫార్చునర్ కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి.