AP News: శ్రీ సత్యసాయి జిల్లా కోడికొండ వద్ద ప్రమాదం.. కర్ణాటక ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాన్ ఢీ
AP News: ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి
AP News: శ్రీ సత్యసాయి జిల్లా కోడికొండ వద్ద ప్రమాదం.. కర్ణాటక ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాన్ ఢీ
AP News: శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కోడికొండ చెక్‌పోస్ట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు వైపు వెళ్తున్న KSRTC బస్సును ఐచర్ వాహనం ఢీ కొన్న ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు నార్పల మండలంకు చెందిన వెంకటరాముడిగా గుర్తించారు. కర్ణాటక బస్సులోని పది మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంపై చిలమత్తూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.