Road Accident: పెళ్లి బృందం ట్రాక్టర్‌ బోల్తా.. ఆరుగురి మృతి

Road Accident: 25 మందితో ట్రాక్టర్లో వెళ్తున్న పెళ్లిబృందం.. చిత్తూరు సమీపంలో ఘటన

Update: 2022-12-08 00:52 GMT

Road Accident: పెళ్లి బృందం ట్రాక్టర్‌ బోల్తా.. ఆరుగురి మృతి

Road Accident: చిత్తూరు సమీపంలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. వివాహ శుభకార్యానికి వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ సంఘటనలో ఆరుగురు మృతి చెందారు. పూతలపట్టు మండలం లక్ష్మయ్య ఊరు సమీపంలో ఘటన చోటుచేసుకుంది. ఐరాల మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన 25 మందితో కూడిన ట్రాక్టరులో పూతలపట్టు మండలం జెట్టిపల్లి గ్రామానికి వివాహానికి వెళుతుండగా ట్రాక్టర్ అదుపు తప్పింది. మార్గమధ్యంలో లక్ష్మయ్య ఊరుసమీపంలో ట్రాక్టర్ బోల్తా పడింది. ముగ్గురు ఆడవాళ్లు, ఒక డ్రైవర్, ఇద్దరు చిన్నపిల్లలు మరణించారు. సమాచారం అందుకున్న పూతలపట్టు, తవణంపల్లి, ఐరాల పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను 108 అంబులెన్స్, ప్రైవేటు వాహనాల ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News