అనంతపురం జిల్లాలో అంబులెన్స్ ను ఢీకొన్న కర్నాటక బస్సు
Anantapur: ఉరవకొండ ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఘటన
అనంతపురం జిల్లాలో అంబులెన్స్ ను ఢీకొన్న కర్నాటక బస్సు
Anantapur: అనంతపురం జిల్లా ఉరవకొండలో కర్నాటక బస్సు 106 అంబులెన్స్ వాహనాన్ని ఢీకొట్టింది. ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అంబులెన్స్ లో పేషంట్ ను తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. ఉరవకొండ ఆర్టీసీ బస్టాండ్ దగ్గరకు రాగానే కర్ణాటక బస్సు దూసుకెళ్లి 108 వాహనాన్ని డీకొట్టింది. ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. 108 వాహనం, కర్ణాటక బస్సు డ్యామేజ్ అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద ఘటనను పరిశీలించారు.