RGV Sensational Comments: ఆనందయ్య పై ఆర్టీవీ సెన్షేషనల్ కామెంట్స్

RGV Sensational Comments: ఆనందయ్య వ్యవహారంపై వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు.

Update: 2021-05-22 01:05 GMT

RGV- Krishnapatnam Anandaiah

RGV Sensational Comments: ఆనందయ్య.. ఇప్పుడు కరోనా పేషెంట్లు దేవుడిలా ఫీలవుతున్న ఆయుర్వేద వైద్యుడు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బారులు తీరిన వాహనాలు.. వెయిటింగ్ లో ఉన్న వేలాదిమంది జనం.. ఆనందయ్య వాల్యూ ఏంటో చెబుతున్నాయి. ఆయన పసరు వైద్యం పని చేస్తుందా లేదా అన్నది ఇప్పటికీ ఇంకా అధికారికంగా తేల్చలేదు. కాని వైద్యం పొందిన వారంతా అద్భుతమని అంటుండంతో.. అందరూ అటువైపే పరుగులు పెడుతున్నారు.

ఈ తరుణంలో ఆనందయ్య వ్యవహారంపై వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్యపై ఓ రేంజ్‌లో సెటైర్లు వేశారు. ఈ ఆయుర్వేద మందుపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి వరుస ట్వీట్లు చేశారు.

ఒకవేళ ఆనందయ్య చెప్పిన ప్రకారం.. కరోనా రోగుల కళ్లలో వేపాకు గుజ్జు, కాగబెట్టిన తేనె వేయడం ద్వారా కోలుకుంటే.. ఆ వైద్యం ఫైజర్, భారత్ బయోటెక్, పూనావాలా లాంటి వ్యాక్సిన్ల కంటే మెరుగ్గా పని చేస్తే.. నేనొక అమాయకమైన పౌరుడినని భావిస్తాను? అలాగే, ఒకవేళ ఆనందయ్య ట్రీట్మెంట్‌కు ఐసీఎంఆర్ నివేదిక అనుకూలంగా వస్తే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైంటిస్టులు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు పారాచూట్లు వేసుకుని వస్తారు.

హే, ఆనందయ్య జీ.. నాకు నోరు, ముక్కు, చివరికి చెవులు కూడా బాగానే ఉన్నాయి. కానీ, కళ్లకు, ఊపిరితిత్తులకు ఉన్న సంబంధం ఏంటో అర్థమై చావట్లేదు. కాబట్టి, ప్రభుత్వం ఇక, భారత్ బయోటెక్, పూనావాలా, స్పుతినిక్ వ్యాక్సిన్‌కు నిధులు ఇవ్వడం ఆపేసి.. ఆ డబ్బు ఆనందయ్యకు ఇవ్వాలని కోరుతున్నా!

ప్రభుత్వానికి నా మనవి ఏమంటే.. ఆక్సిజన్ కొరతతో, బెడ్లు అందుబాటులో లేక జరిగిన పొరపాట్లు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఆనందయ్యకు సహకరించండి. ఆనందయ్య అయితే తేనె, వేపాకు గుజ్జు, బీట్ రూట్, వేరుశనగపప్పు, గడ్డి, ఉల్లిగడ్డలు.. ఇలా ఏవైనా సరే అన్నింటిని కలిపేసి ప్రజల జీవితాలను కాపాడేస్తారు. ఆయుర్వేద మందు కోసం శుక్రవారం ఎవరూ ఊహించని విధంగా వేల సంఖ్యలో ప్రజలు వచ్చారు. దీంతో జనం ఎక్కువగా గుమిగూడారని ఆనందయ్యను ఆఫీస్‌కు పిలిపించి ఎస్పీ మాట్లాడారు. అయితే, ఆనందయ్యను పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈ ప్రచారాన్ని నెల్లూరు ఎస్పీ కొట్టిపారేశారు.


Tags:    

Similar News