Anantapuram: అనంతపురం జిల్లాలో రెవెన్యూ అధికారులు అవినీతి

* పని కావాలంటే డబ్బులు చెల్లించాల్సిందే *భూమి రికార్డు చేయడం కోసం డబ్బులు డిమాండ్ చేసిన రెవెన్యూ ఇన్స్‌పెక్టర్

Update: 2021-08-21 12:15 GMT

తహసీల్దార్ కార్యాలయం(ఫైల్ ఫోటో)

Anantapuram: అనంతపురం జిల్లాలో రెవెన్యూ అధికారులు అవినీతి బాగోతం మరోసారి బయటపడింది. ఓ రైతు నుంచి డబ్బులు తీసుకుంటున్నవీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనంతపురం జిల్లా కూడేరు మండలం రెవిన్యూ ఇన్స్‌పెక్టర్ శివారెడ్డి రైతు రికార్డులు చేయడానికి 10వేల రూపాయలు డబ్బులు తీసుకుంటున్న వీడియో ఇప్పుడు వెలుగు చూసింది.

అయితే కూడేరు మండల రెవెన్యూ కార్యాలయం కొంతకాలంగా అవినీతికి నిలయంగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఇదే కార్యాలయంలో తహసీల్దార్ తో పాటు ఐదురుగు ఉద్యోగులు అక్రమాలకు పాల్పడ్డారన్నఆరోపణలతో సస్పెండ్ అయినట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News