Visakhapatnam: విశాఖలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు

Visakhapatnam: సాయంత్రం 5గంటల నుంచి బీచ్‌ రోడ్డు, BRTS రోడ్డు.. తెలుగుతల్లి ఫ్లైఓవర్‌, NAD ఫై ఓవర్‌లు మూసివేత

Update: 2021-12-31 06:30 GMT

విశాఖలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు

Visakhapatnam: విశాఖలో నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలను నగర వాసులు ఇంట్లోనే జరుపుకోవాలని సూచించారు. ఎవరైనా ఆంక్షలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌ కుమార్‌ సిన్హా హెచ్చరించారు. ప్రజలంతా తమ ఇళ్లలోనే వేడుకలు జరుపుకోవాలని, ఒకవేళ అపార్టుమెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో నివసించే వారైతే వారి సముదాయం ఆవరణలో జరుపుకోవాలని సూచించారు. డీజేలు, సంగీత కార్యక్రమాల ఏర్పాటు, పార్కులు, మైదానాలు, రోడ్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు జరుపుకోవడం నిషేధం అని వెల్లడించారు.

ఇవాళ సాయంత్రం ఐదు గంటల నుంచి బీచ్‌ రోడ్డు, BRTS రోడ్డు, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌, NAD ఫై ఓవర్‌లను మూసివేయనున్నారు. ఆ సమయంలో యారాడ నుంచి భీమిలి వరకూ బీచ్‌ రోడ్డులోకి వాహనాలను అనుమతించమని పోలీసులు తెలిపారు. బైక్‌లను స్పీడ్‌గా, భారీ శబ్దాలతో నడపడం వంటి చర్యలకు పాల్పడే యువత ఆటకట్టించేందుకు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

అయితే నూతన సంవత్సర వేడుకలను ఉత్సాహంగా అందరితో కలసి జరుపుకోవాలని ఎదురుచూస్తున్న యువతకు పోలీస్ అధికారుల ఆంక్షలతో నిరుత్సాహానికి గురైయ్యారు. పోలీస్ ఆంక్షలతో న్యూఇయర్ వేడుకలను కుటుంబసభ్యులు మధ్య ఇంట్లోనే జరుపుకుంటామనిని నగర యువత అంటున్నారు.

Tags:    

Similar News