Telugu Akademi Case: తెలుగు అకాడమీ నిధుల కేసులో రిమాండ్‌ రిపోర్టు

*10 మందిని అరెస్ట్ చేశామన్న సీసీఎస్ పోలీసులు *సాయికుమార్‌ కీలక సూత్రధారిగా తేల్చిన పోలీసులు

Update: 2021-10-07 10:17 GMT

తెలుగు అకాడమీ 

Telugu Akademi Case: తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగుచూశాయి. ఈ కేసులో ఇప్పటికే 10మందిని అరెస్ట్ చేశారు సీసీఎస్‌ పోలీసులు. కీలక సూత్రధారి సాయికుమార్‌గా తేల్చిన పోలీసులు కృష్ణారెడ్డి, పద్మనాభన్‌, మదన్, భూపతి, యోహన్‌రాజ్‌ పరారీలో ఉన్నట్టు తెలిపారు.

భూపతి సాయంతో తెలుగు అకాడమీ డిపాజిట్లను యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యేలా సాయి కుమార్ ప్లాన్‌ చేసినట్టు పేర్కొన్నారు. డిపాజిట్‌ పత్రాలను ఫోర్జరీ చేసి 64.5 కోట్లను కొల్లగొట్టి వాటాలుగా పంచుకున్నారని రిమాండ్‌ రిపోర్టులో వెల్లడించారు. నిందితులు సాక్ష్యాలను తారుమారు చేసే ఛాన్స్‌ ఉందని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు సీసీఎస్‌ పోలీసులు.

Tags:    

Similar News